News September 11, 2025

జడ్చర్ల: ఎరువు విక్రయ కేంద్రాల తనిఖీ

image

జడ్చర్ల మండలంలో ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా బస్తాలను సమయానికి, పారదర్శకంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రైతులకు ఎరువుల పంపిణీ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

Similar News

News November 8, 2025

మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

మహబూబ్ నగర్ నియోజకవర్గం మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. MBNR ఫస్ట్ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ శనివారం తెలిపారు.18 నుంచి 50 వయసు ఉండాలని 72079 88913, 72079 88914 సంప్రదించాలన్నారు.

News November 8, 2025

MBNR: ఈనెల 10, 11న ఖో-ఖో ఎంపికలు

image

మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాల, బాలికల ఖో-ఖో జట్ల ఎంపికలను డీఎస్ఏ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి తెలిపారు. ఈ నెల 10న అండర్-14, 11న అండర్-17 ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ జిరాక్స్‌లతో ఉదయం 9 గంటలలోపు పీడీ మొగులాల్ (99859 05158)ను సంప్రదించాలని సూచించారు.

News November 7, 2025

హిందువులు సత్తా చాటాలి: MP డీకే అరుణ

image

2 లక్షలకు పైగా ఉన్న హిందువులంతా ఏకమై జూబ్లీహిల్స్ ఊప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బోడబండలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు.