News March 17, 2025
జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.
Similar News
News September 15, 2025
మంచిర్యాలలో కలకలం రేపిన జేఎల్ఏం ఆత్మహత్యాయత్నం

మంచిర్యాలలోని జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం భవనం పైనుంచి దూకి జూనియర్ లైన్ మెన్ బూసి రాజు ఆత్మహత్యాయత్నం చేయడం సోమవారం కలకలం రేపింది. చెన్నూర్ లైన్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన తన తండ్రి వందనం మరణించగా.. రాజుకు ఉద్యోగం లభించింది. తన తల్లి రోజామణికి పెన్షన్, హెల్త్ కార్డు మంజూరులో జాప్యం చేస్తున్నారని రాజు తెలిపారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.
News September 15, 2025
గద్వాల: రేపు ఈవీఎంల తనిఖీలు

ఈవీఎంలను మంగళవారం తనిఖీ చేస్తామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు క్యాంప్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు ఈ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు.
News September 15, 2025
విశాఖ బీచ్ పరిశుభ్రత లోపాలపై కమిషనర్ ఆగ్రహం

విశాఖ వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ధ్యేయమని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ఎక్కడా వ్యర్థాలు కనిపించకూడదని ఆదేశించారు. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ముందుస్తు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. RK బీచ్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో బీచ్ స్వీపింగ్ యంత్రాలు నిర్వహించే ఏజెన్సీ ఫామ్‌టెక్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.