News January 27, 2025
జడ్చర్ల: తాజా మాజీ సర్పంచ్ మృతి
జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ సింగం దాస్ నర్సింహులు అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. నరసింహులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 29, 2025
MBNR:మన్యం కొండ జాతర ఏర్పాట్లపై సమీక్ష
మన్యం కొండ దేవస్థానం ప్రతిష్ఠను పెంచే విధంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసిలో మన్యంకొండ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,SP డి.జానకి పాల్గొన్నారు.
News January 29, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!
✔Way2Newsతో SBI, SBRSETI డైరెక్టర్
✔ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ డీకే అరుణ
✔FBR 7నుంచి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు
✔తగ్గిన చలి.. పెరిగిన ఉష్ణోగ్రతలు
✔సీఎం,MLAల చిత్రపటానికి పాలాభిషేకం
✔UPS విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన
✔మరికల్:వేధింపుల కేసులో వ్యక్తికి జైలు శిక్ష
✔మక్తల్: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే
✔దామరగిద్ద: అనుమానాస్పద స్థితిలో..చిరుత మృతి
News January 28, 2025
MBNR: ఫిబ్రవరి 7 నుంచి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు
తెలంగాణ తిరుపతిగా భావించే మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రంగరంగ వైభవంగా మన్యం కొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.