News December 19, 2025

జడ్చర్ల: నేటి నుంచి మైనార్టీ గురుకుల క్రీడలు

image

తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యార్థుల ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు (జోష్-2025) శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జడ్చర్ల మండల కేంద్రంలోని మైనార్టీ బాలుర పాఠశాల వేదికగా ఈ నెల 21 వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఖాజా బహుద్దీన్ తెలిపారు. 3వ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా అథ్లెటిక్స్, ఖో-ఖో, కబడ్డీ వంటి వివిధ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటనున్నారు.

Similar News

News December 21, 2025

వయస్సు పెరిగినా వివాహం జరగట్లేదా?

image

పెళ్లీడు వచ్చినా సంబంధాలు కుదరకపోవడం, చివరి నిమిషంలో క్యాన్సలవ్వడం వంటి సమస్యలు నేటి కాలంలో అధికమయ్యాయి. దీనికి కుజ, గ్రహ దోషాలే కారణమంటున్నారు జ్యోతిష నిపుణులు. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటున్నారు. అర్ధనారీశ్వర స్తోత్రం పఠిస్తే వివాహ ఆటంకాలు తొలగుతాయట. గురువారం రోజున ఆవుకు శనగలు, అరటిపండ్లు తినిపిస్తే.. గురు గ్రహ అనుగ్రహం కలిగి త్వరగా వివాహం నిశ్చయమవుతుందని సూచిస్తున్నారు.

News December 21, 2025

మేడారం జాతరకు రాష్ట్రపతికి ఆహ్వానం

image

TG: జనవరి 28-31 వరకు జరిగే మేడారం జాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వింటర్ విడిది కోసం ముర్ము ప్రస్తుతం HYD బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉన్న విషయం తెలిసిందే. నేడు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కలిసి జాతరకు ఆహ్వానించనున్నారు. మరోవైపు మేడారం గద్దెల పనులు చకాచకా జరుగుతున్నాయి. జాతర కంటే ముందే పనులు పూర్తి కానున్నాయి.

News December 21, 2025

శ్రీవారి భక్తుల కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

image

AP: శ్రీవారి భక్తులకు తిరుపతిలోనే వసతి కల్పించేందుకు అలిపిరిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి టీటీడీ నిర్ణయించింది. 25వేల మందికి వసతి కెసాసిటీతో దాదాపు రూ.4వేల కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో వేలాది గదులు, బాత్రూమ్‌లు, లాకర్లు, అన్నప్రసాద వితరణ కేంద్రాలతోపాటు ప్రైవేటు రెస్టారెంట్లు, పార్కు, ఆడిటోరియం ఉంటాయని సమాచారం.