News September 6, 2025
జడ్చర్ల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: MP

నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం విహెచ్పీ ఆధ్వర్యంలో నేతాజీ చౌక్ లో జరుగుతున్న వినాయక నిమజ్జనోత్సవంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ తీమ్ తో ఏర్పాటుచేసిన గణపతి మండపాన్ని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఎంపీ ప్రజలందరిపై గణపయ్య ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
Similar News
News September 5, 2025
పాలమూరులో వినాయక నిమజ్జనం.. ఎస్పీ సూచనలు

మహబూబ్‌నగర్‌లో గణపతి నిమజ్జనోత్సవం శాంతియుతంగా, ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎస్పీ డి.జానకి, జిల్లా పోలీస్ కవాతు మైదానంలో పోలీస్ అధికారులతో, సిబ్బందితో బ్రీఫింగ్ సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్స్, రూఫ్ టాప్ బందోబస్తు, మఫ్టీ పోలీసులు, పెట్రోలింగ్, స్ట్రైకింగ్ ఫోర్స్లను 280 మంది పోలీసులను ఏర్పాటు చేసింది.
News September 5, 2025
MBNR: ఓపెన్ SSC, INTER.. అప్లై చేసుకోండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు ఈనెల 7తో (ఫైన్ లేకుండా) గడువు ముగుస్తుందని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 20లోగా ఫైన్‌తో అప్లై చేసుకోవచ్చని, ఆసక్తిగల విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 5, 2025
HYD: బాహుబలి యాక్టర్‌కు కీర్తి పురస్కారం

తెలుగు వర్శిటీలో రంగస్థలం విభాగ గెస్ట్ ఫాకల్టీ, సినీ నటుడు, రంగస్థల దర్శకుడు డా.రాయల హరిశ్చంద్ర కీర్తి పురస్కార అవార్డు అందుకున్నారు. ఈ మేరకు నాటకరంగం విద్యార్థులు ఘనంగా సన్మానించి సత్కరించారు. దేశములోనే మేకప్, కాస్ట్యూమ్స్ అంశాలపై కేంద్రీయ విశ్వవిద్యాలయం(HYD) ద్వారా Ph.D చేసిన మొదటి వ్యక్తి. ఇతను బాహుబలి, విరూపాక్ష తదితర సినిమాల్లో నటించారు.VC నిత్యానందరావు, రిజిస్ట్రార్ హనుమంతరావు అభినందించారు.