News March 1, 2026
జడ్జిల రెసిడెన్షియల్ ఎన్‌క్లేవ్‌ను ప్రారంభించిన CJI

అమరావతిలో నిర్మించిన జడ్జిల రెసిడెన్షియల్ ఎన్‌క్లేవ్‌ను ఆదివారం CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. నిర్మాణం పూర్తైన జడ్జిల బంగ్లాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం CJI పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారాన్ని అధికారులు CJI, న్యాయమూర్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Similar News
News March 2, 2026
చైనా ఆయుధాలు మరోసారి తుస్సు

చైనా డిజైన్ చేసిన ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్స్ మరోసారి ఫెయిలయ్యాయి. వీటిని నమ్ముకునే US, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ఎదుర్కొనేందుకు ప్రయత్నించి దెబ్బతింది. ఆ దేశం ఇచ్చిన HQ-9B డిఫెన్స్ సిస్టమ్ శత్రువుల మిసైళ్లను ఎదుర్కోలేకపోయింది. కొన్నింటిని అసలు గుర్తించలేకపోయింది. దీంతో ఇరాన్ భారీగా నష్టపోయింది. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు మడురో, ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో పాక్ సైతం చైనాను నమ్ముకొని దెబ్బతిన్నాయి.
News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 1/2

ఒకప్పుడు US, సోవియట్ యూనియన్‌లు అంతరిక్షంలో పైచేయి కోసం పోటాపోటీగా ప్రాజెక్టులు చేపట్టాయి. మూన్ ల్యాండింగ్‌పై నాసాకు పోటీగా చైనా కూడా ప్రాజెక్ట్ స్పీడప్ చేసినట్లు ప్రకటించడంతో మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. 2028 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని నాసా ప్లాన్ చేయగా.. చైనా ఈ టార్గెట్ 2030కి పెట్టుకుంది. మరోవైపు భారత్ సైతం 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని అనుకుంటోంది.
News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 2/2

మూన్ ల్యాండింగ్‌తో పాటు వివిధ స్పేస్ ప్రాజెక్టులపైనా భారత్ ఫోకస్ పెంచింది. ఇదంతా ఒకప్పుడు ప్రతిష్ఠ కోసమైతే ఇప్పుడు అది అవసరం. అంతరిక్షంపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాలను శాసించగలమని, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోగలమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అంతేకాదు స్పేస్‌లో మరింత లోతుగా అన్వేషించేందుకు చంద్రుడిని వ్యోమనౌకల రీఫ్యూల్లింగ్ స్టేషన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.


