News September 9, 2025
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కలెక్టరేట్‌లో సమీక్ష

కామారెడ్డి జిల్లాలో రాబోయే MPTC, ZPTC ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇవాళా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 25 ZPTC, 233 MPTC స్థానాలకు జరగబోయే ఎన్నికల కోసం ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను ఈ నెల 6న ప్రచురించామని తెలిపారు. SEP 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి, వాటి పరిష్కారం అనంతరం 10న తుది జాబితాను విడుదల చేస్తామన్నారు.
Similar News
News September 9, 2025
అనంతపురానికి CM చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే!

★ రేపు మ.12 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో అనంతపురం బయలుదేరుతారు
★ మ.1.30కి అనంతపురం చేరుకుంటారు
★ అనంతరం మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం
★ మ.2-సా.4.30 వరకు ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6-సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగం
★ సభ ముగిశాక ఉండవల్లికి తిరుగుపయనం
▶ అనంతపురానికి సీఎం, డిప్యూటీ సీఎం, కూటమి ఎమ్మెల్యేలందరూ వస్తుండటంతో 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
News September 9, 2025
HYD: 2027 నాటికి 316 కోట్ల లీటర్ల వాటర్ డిమాండ్..!

HYDలో నీటి డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పెరగనుందని జలమండలి అంచనా వేసింది. ప్రస్తుతం రోజుకు 600 MGD నీరు అవసరం కాగా.. 2027 నాటికి 835 మిలియన్ గ్యాలన్లకు(316 కోట్ల లీటర్లు) డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. 2047 నాటికి ఇది 1114 మిలియన్ గ్యాలన్లకు చేరుకుంటుందని అంచనాలు రూపొందించింది. ఇందులో భాగంగానే 2030 నాటికి 300 మిలియన్ గ్యాలన్ల అదనపు నీటిని నగరానికి తరలించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
News September 9, 2025
రామ్మోహన్ నాయుడు కుమారుడికి లోకేశ్ ఆశీస్సులు

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్, శ్రావ్య దంపతుల బిడ్డకు ఆయన ఆశీస్సులు అందజేశారు. బాబును ఎత్తుకుని ముద్దాడారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు రామ్మోహన్ కుమారుడికి ఆశీస్సులు అందించిన విషయం తెలిసిందే. 2017లో రామ్మోహన్, శ్రావ్య వివాహం చేసుకోగా 2021లో కూతురు(శివంకృతి) జన్మించింది. నెల క్రితం బాబు పుట్టాడు.