News March 27, 2025
జడ్పీ కోఆప్షన్ మెంబర్‌గా మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్

కర్నూలు జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్‌గా వైసీపీ నేత మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్‌తో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి పీ.రంజిత్ బాషా ప్రమాణ స్వీకారం చేయించారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News March 31, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు ➤ శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి➤ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐల బదిలీ ➤ బ్రెయిలీ భగవద్గీత రూపకర్తకు ఉగాది పురస్కారం➤ కర్నూలులో ఉగాది ఉత్సవాల్లో మంత్రి, జిల్లా కలెక్టర్ ➤ నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పండి: జిల్లా ఎస్పీ➤ RU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల➤ రాఘవేంద్ర స్వామి మఠంలో పంచాంగ శ్రవణం
News March 30, 2025
ఆర్యు డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

రాయలసీమ యూనివర్సిటీ 1,3,5 సెమిస్టర్ డిగ్రీ ఫలితాలను ఆదివారం యూనివర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఉమా ఆదేశాల మేరకు విడుదల చేశారు. 1వ సెమిస్టర్‌లో 7,643 మంది పరీక్ష రాయగా 3,827 మంది ఉత్తీర్ణత సాధించారు, 3వ సెమిస్టర్‌లో 6,169 మంది పరీక్ష రాయగా 3,134 ఉత్తీర్ణత సాధించారు. 5వ సెమిస్టర్ 5,709 మంది పరీక్ష రాయగా 4,097 మంది ఉత్తీర్ణత సాధించారు. వీటితోపాటు సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేశారు.
News March 30, 2025
నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పండి: జిల్లా ఎస్పీ

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.