News December 19, 2025
జడ్పీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి: VKB కలెక్టర్

వికారాబాద్ జిల్లా పరిషత్తు నూతన భవన నిర్మాణ పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జడ్పీ సీఈఓ సుధీర్, పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్‌తో కలిసి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మంగాలాల్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 21, 2025
కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

TG: కన్హా శాంతివనంలో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖులు ఒకే వేదికపై ధ్యానం చేశారు. ఇవాళ రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా లక్ష మందితో వర్చువల్ ధ్యానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం <
News December 21, 2025
హనుమకొండ: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

టాస్క్ రీజనల్ సెంటర్‌లో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీష్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27 లోపు హనుమకొండ చైతన్య యూనివర్సిటీలోని టాస్క్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
News December 21, 2025
YS జగన్‌కు పవన్, షర్మిల విషెస్

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ‘మాజీ సీఎం జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అని Dy.CM పవన్ ట్వీట్ చేశారు. APCC చీఫ్ షర్మిల, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం X వేదికగా విషెస్ చెప్పారు.


