News April 3, 2025

జనగాం యువతకు కలెక్టర్ సూచనలు

image

యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగించుకోవాలన  కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రంలో అందజేయాలన్నారు.

Similar News

News September 18, 2025

VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

image

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.

News September 18, 2025

యూరియా తగినంత ఉంది కలెక్టర్ కీర్తి

image

జిల్లాలో యూరియా కొరతపై వ్యాపించిన వదంతులను నివృత్తి చేయడానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామాన్ని సందర్శించారు. దొమ్మేరు ప్యాక్స్ వద్ద రైతులు, అధికారులతో ఆమె మాట్లాడారు. జిల్లాలో యూరియా తగినంత నిల్వ ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

News September 18, 2025

నేను అన్ని మతాలను విశ్వసిస్తా: CJI గవాయ్

image

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ వస్తున్న విమర్శలపై CJI గవాయ్ స్పందించారు. ‘నేను అన్ని మతాలను విశ్వసిస్తా, గౌరవిస్తా. నా వ్యాఖ్యల్ని SMలో తప్పుగా చూపించారు’ అని అన్నారు. ఖజురహోలో ధ్వంసమైన విష్ణువు విగ్రహ పునర్నిర్మాణానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను ఇటీవల SC తిరస్కరించింది. ఈ సందర్భంగా ‘ASIని సంప్రదించండి లేదా ఏదైనా చేయమని దేవుడినే వేడుకోండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.