News March 20, 2025

జనగామలో ఒక్క రోజు దీక్షను జయప్రదం చేయాలని పిలుపు

image

జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ.. మార్చి 21న జనగామ చౌరస్తాలో నిర్వహించనున్న ఒక్క రోజు దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ.. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో బుధవారం పాలకుర్తి చౌరస్తాలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొడిశెట్టి వెంకన్న గౌడ్, తండ రమేశ్ గౌడ్, పులి గణేశ్ గౌడ్, పోశాల వెంకన్న గౌడ్, మూల వెంకటేశ్వర్లు, యాకయ్య గౌడ్ తదితరులున్నారు.

Similar News

News March 20, 2025

భూపాలపల్లి: రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

image

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు ఈనెల 21నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దీనికోసం 2,650 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా తేదీల్లో ఉ’9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

News March 20, 2025

సన్నబియ్యం పంపిణీ ఎప్పటినుంచంటే?

image

TG: ఈ ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వనుంది. ఇందుకోసం గోదాముల్లో సన్నబియ్యం సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇవి 4 నెలలకు సరిపోతాయని అంచనా. మొత్తం 91,19,268 రేషన్ కార్డులు ఉండగా 2,82,77,859 మంది లబ్ధిదారులు ఉన్నారు.

News March 20, 2025

గద్వాల్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి

image

గద్వాల్ జిల్లాలో జిల్లాలో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. బుధవారం అలంపూర్‌లో గరిష్ఠంగా 40.3, గద్వాల్, సాతర్లలో 40.2, కొలూర్ తిమ్మనదొడ్డిలో 39.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సయమంలో బయటకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!