News October 22, 2025
జనగామలో వెలిగిన ఆకాశ జ్యోతి..!

కార్తీకమాసాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ శ్రీఉమామహేశ్వర దేవాలయంలో కార్తీకమాసం మొదటి రోజు సందర్భంగా బుధవారం రాత్రి ఆకాశ జ్యోతిని వెలిగించారు. ఆలయ పూజారి సాంబమూర్తి కార్తీక మాస పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అనురాధ, రాణి, హైమ, రమ, ఉమా, మౌనిక, విజయ, ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 24, 2025
తిరుపతి: జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

APSSDC ఆధ్వర్యంలో జర్మనీలో ఎలక్ట్రిషన్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేసి, 2 ఏళ్ల అనుభవం కలిగి 30 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు https://naipunyam.ap.gov.in/user-registration వెబ్ సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 02.
News October 24, 2025
ఇతిహాసాలు క్విజ్ – 45 సమాధానాలు

1. రావణుడు పుష్పక విమానాన్ని ‘కుబేరుడి’ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాడు.
2. కురు రాజ్యానికి మంత్రి ‘విదురుడు’.
3. ఆంజనేయుడికి గదను ఆయుధంగా ‘కుబేరుడు’ ఇచ్చాడు.
4. లక్ష్మీదేవి ‘క్షీరసాగర మథనం (పాల సముద్రం చిలికినప్పుడు) సమయంలో’ ఆవిర్భవించింది.
5. యమధర్మరాజు సోదరి ‘యమునా దేవీ’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 24, 2025
జిల్లాలో రాబోయే 5 రోజులు వర్షాలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వాతావరణ పరిశీలన కేంద్రం టెక్నికల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ తెలిపారు. రైతులు కోసి ఎండబెట్టిన మొక్కజొన్న, సోయాచిక్కుడు పంటలను టార్ఫాలిన్ కవర్లతో కప్పడం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని ఆమె సూచించారు.


