News August 19, 2025
జనగామలో 1273 మెట్రిక్ టన్నుల యూరియా

జిల్లా వ్యాప్తంగా 1273.935 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ నిల్వ ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. బచ్చన్నపేట 10.516, చిల్పూర్ 82.29, దేవరుప్పుల 181.335, ఘన్‌పూర్ స్టేషన్ 172.545, జనగామ 155.32, కొడకండ్ల 56.745, లింగాల ఘన్‌పూర్ 99.375, నర్మెట్ట 74.295, పాలకుర్తి 80.405, రఘునాథ్‌పల్లి 192.457, తరిగొప్పుల 21.51, జఫర్‌గఢ్ 69.93 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News August 24, 2025
DSCలో 3 ఉద్యోగాలు సాధించిన రేవతి

ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లెకు చెందిన వీరప్ప-లింగమ్మ కుమార్తె రేవతి డీఎస్సీలో 3 ఉద్యోగాలు సాధించింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రేవతి 9వ ర్యాంక్‌తో స్కూల్ అసిస్టెంట్, 6వ ర్యాంక్‌తో PGT, TGT పోస్టులకు అర్హత సాధించింది. తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని రేవతి అన్నారు.
News August 24, 2025
ఇక జిల్లాల్లోనే క్యాన్సర్ చికిత్స!

TG: క్యాన్సర్ మహమ్మారి చికిత్స కోసం HYDకు రాకుండా జిల్లాల్లోనే వైద్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బోధనాస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. తక్షణమే 34 మెడికల్ కాలేజీల్లో 20 పడకల(10 కీమో, 10 పాలియేటివ్ కేర్) చొప్పున కేటాయించనుంది. ఇప్పటికే 27 సెంటర్లకు కేంద్రం రూ.40.23 కోట్లు నిధులు ఇవ్వగా మరో ఏడింటిని రాష్ట్ర నిధులతో సమకూర్చనున్నారు.
News August 24, 2025
మధ్యాహ్నం నిద్రపోతున్నారా: చాణక్య నీతి

మధ్యాహ్నం నిద్ర మేలు కాదని చాణక్య నీతి చెబుతోంది. దీంతో ఇతరుల కంటే పని తక్కువగా చేయడమే కాకుండా సమయం వృథా అవుతుంది. డబ్బు నష్టపోయే అవకాశముంది. జబ్బు చేసిన వారు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు మాత్రమే నిద్ర పోవాలని అంటోంది. మధ్యాహ్నం నిద్రతో జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు. పవర్ న్యాప్(10-15 నిమిషాల నిద్ర)కు ఇది మినహాయింపు.
<<-se>>#chanakyaneeti<<>>