News December 22, 2025

జనగామ: అంబులెన్స్‌లో వచ్చి సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం

image

జనగామ మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్ అంబులెన్స్‌లో వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారిణిగా ఏఈవో సౌమ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సర్పంచ్ గొల్లపల్లి అలేఖ్య అనారోగ్యంతో ఉండగా అంబులెన్స్‌లో వచ్చి మరీ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్‌గా గొల్లపల్లి పర్షయ్య ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

Similar News

News December 24, 2025

సంక్రాంతి తర్వాత సర్పంచ్‌లకు ట్రైనింగ్

image

TG: ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌లగా ఎన్నికైన వారికి సంక్రాంతి తర్వాత పల్లెల్లో పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి, గ్రామసభల నిర్వహణ తదితరాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా ఒక్కో బ్యాచ్‌లో 50 నుంచి 100 మంది ఉండేలా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరిగిన తర్వాతే ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది.

News December 24, 2025

ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

image

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.

News December 24, 2025

కొత్త సంవత్సరంలో ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి

image

న్యూ ఇయర్‌లో అదృష్టం వరించాలంటే ఇంట్లోకి శ్రీయంత్రం, శాలిగ్రామం, స్వస్తిక్ గుర్తులను తీసుకురావాలని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘ఇంటి ఆవరణలో తులసి, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, లక్కీ బ్యాంబూ మొక్కలు నాటండి. తులసి కోట వద్ద శాలిగ్రామాన్ని ఉంచి పూజిస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి’ అని చెబుతున్నారు.