News December 16, 2025
జనగామ: అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు!

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పింకేష్ కుమార్ బాధ్యతలు చేపట్టి మంగళవారంతో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ మేరకు ఆయనకు పలువురు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈయన అదనపు కలెక్టర్ బాధ్యతలతో పాటు విద్యాశాఖ, మున్సిపల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండేళ్లలో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.
Similar News
News December 16, 2025
నెల్లూరులో మరో లేడీ డాన్.. ఇకపై వివరాలు చెబితే ప్రైజ్ .!

నెల్లూరులో పదేళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు DSP ఘట్టమనేని తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంటిలో 20.90కిలోల గంజాయి లభ్యం అయిందన్నారు. దీంతో ఆమెతోపాటు కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటూ నగదు రివార్డ్ ఇస్తామని DSP పేర్కొన్నారు.
News December 16, 2025
సంక్రాంతికి విజయనగరంలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విజయనగరం ఆర్టీసీ వారు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డీపీటీవో జీ.వరలక్ష్మి తెలిపారు. విజయనగరం, ఎస్.కోట డిపోల నుంచి జనవరి 8-14వ తేదీ వరకు ప్రతీ రోజు విజయవాడ, భీమవరం, రాజోలు, విశాఖకి ప్రత్యేక బస్సులు నడుపుటకు వెల్లడించారు. ఈ బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేవని.. సాధారణ ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయి చెప్పారు.
News December 16, 2025
NGKL: మూడో విడతలో 158 గ్రామాలకు ఎన్నికలు

NGKL జిల్లాలో ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రం ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం ఏడు మండలాల పరిధిలోని 158 గ్రామపంచాయితీలలో 1,364 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అచ్చంపేట, పదర, ఉప్పునుంతల, బల్మూరు, లింగాల, చారకొండ, అమ్రాబాద్ మండలాలలో ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.


