News November 22, 2025

జనగామ: ఆదర్శం.. ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు!

image

ఉద్యోగ విరమణ పొందిన దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంకు చెందిన శ్రీరామ్ రాజయ్య తాను పదవీ విరమణ పొందిన పాఠశాలలోనే విరమణ లేని విశ్రాంత ఉపాధ్యాయుడిగా బోధిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో కడవెండి ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయుడిగా విరమణ పొందారు. ఏడాది నుంచి అదే పాఠశాలలో ఉచితంగా పాఠాలు చెబుతున్న ఆయన్ను జనగామ అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అభినందించారు.

Similar News

News November 22, 2025

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య అప్డేట్

image

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరోసారి స్పష్టతనిచ్చారు. గోవాలో జరిగిన IFFI వేడుకల్లో మాట్లాడుతూ ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞ తనతో కలిసి నటించనున్నట్లు ధ్రువీకరించారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో జోష్ నెలకొంది. గతంలో మోక్షజ్ఞ ప్ర‌శాంత్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో డెబ్యూ చేస్తాడని అనుకున్నా ఆ ప్రాజెక్టు గురించి ఎటువంటి అప్‌డేట్స్ లేవు.

News November 22, 2025

MBNR: పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ

image

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ బీఏ,బీకాం,బీఎస్సీ, బీబీఏ బీఎ(L) (CBCS) సెమిస్టర్-I, III, V రెగ్యులర్, బ్యాక్‌లాక్ ఎగ్జామినేషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్‌కి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో ఆర్డర్ కాపీలను అందజేశారు. వీసీ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామన్నారు.

News November 22, 2025

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్…!

image

ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని ఆర్ఐఓ కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. ఫస్ట్ ఇయర్‌కు సంబంధించి 22,265 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్‌కు సంబంధించి 19,163 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారన్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలతో కలిపి 183 కళాశాలలు ఉన్నాయని, ఫీజు చెల్లించని విద్యార్థులు రూ. 2 వేలు ఫైన్‌తో 25వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని ఆయన కోరారు.