News March 17, 2025
జనగామ: ఇంటర్మీడియట్ పరీక్షల సరళి పరిశీలించిన కలెక్టర్

ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని సోమవారం జనగామ జిల్లాలోని ధర్మకంచలోని ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరును అధికారుల నుంచి తెలుసుకున్నారు.
Similar News
News December 15, 2025
కనకాంబరం సాగుకు అనువైన రకాలు

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.
News December 15, 2025
MDK: సర్పంచ్ ఎన్నికల్లో అన్నాచెల్లెళ్ల గెలుపు!

మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో అన్నాచెల్లెళ్లు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. కొండాపూర్ గ్రామ సర్పంచ్‌గా అన్న బేగరి పండరి గెలుపొందారు. అదే మండలంలోని కొత్వాల్ పల్లిలో చెల్లెలు మాల సంగమ్మ సర్పంచ్‌గా నేరుగా బరిలో నిలిచి ప్రజాభిమానంతో గెలుపొందారు. వేర్వేరు గ్రామాల నుంచి సొంత అన్నాచెల్లెళ్లు విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
News December 15, 2025
యువ సత్తా.. 22 ఏళ్లకే సర్పంచ్

TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. కామారెడ్డిలో కళ్యాణి గ్రామ సర్పంచ్‌గా 22 ఏళ్ల నవ్య(Left) ఎన్నికయ్యారు. నవ్యకు 901 ఓట్లు పోలవ్వగా, ప్రత్యర్థి రత్నమాలకు 317 ఓట్లు వచ్చాయి. దీంతో 584 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. భూపాలపల్లిలోని దుబ్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి అంజలి(23-Right) గెలుపొందారు. ప్రత్యర్థిపై 41 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు.


