News October 12, 2025

జనగామ: ఈనెల 25న పత్తి రైతుల రాష్ట్ర సదస్సు

image

ఈనెల 25న జనగామ జిల్లా కేంద్రంలోని పూసల భవనంలో పత్తి రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. పత్తి దిగుమతిపై ఉన్న 11శాతం సుంకాన్ని కొనసాగించాలని, సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని, క్వింటా పత్తికి రూ.10,075 నిర్ణయించాలని, క్వింటా పత్తికి రూ.475 బోనస్ ప్రకటించాలని ఈ సదస్సులో చర్చించనున్నారు. రాష్ట్ర సదస్సులో వందలాది మంది రైతులు పాల్గొననున్నారు.

Similar News

News October 12, 2025

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: KMR కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రజావాణి యథావిధిగా ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ప్రజావాణిలో అందించాలన్నారు.

News October 12, 2025

జూబ్లీహిల్స్‌‌ బైపోల్‌.. ఓటర్ 50-50!

image

HYDలో ఎన్నికలు అంటే నేతల్లో హడావిడి మామూలుగా ఉండదు. ప్రచారంలో పోటాపోటీ కనిపిస్తుంది. కానీ, ఇంత ఆర్భాటం చేసినా ఓటరు మహాశయులు సిటీలో ఎలక్షన్స్ అంటే దూరంగా ఉంటారు. జూబ్లీహిల్స్‌‌లో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. 2023 ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి చేసినా 50% శాతానికే పరిమితం అయ్యింది. ఇక ఈ బైపోల్‌‌లో అయినా ఓటర్లు పోలింగ్‌‌కు వస్తారా? ఎప్పటిలాగే 50-50 అంటారా అనేది వేచి చూడాల్సిందే.