News April 5, 2025

జనగామ: ఉపాధి హామీ సిబ్బందిని అభినందించిన కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం ద్వారా 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యానికి మించి పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, రాష్ట్రస్థాయి అధికారులు అభినందించారు. జిల్లాలో 30 లక్షల 57 వేల పని దినాలు కాగా 30 లక్షల 97 వేల 108 పని దినాలు కల్పించారు. రోజు కూలి దినాల సంఖ్య పరంగా రాష్ట్రంలో నాలుగు స్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News April 5, 2025

పార్వతీపురం: ‘శని, ఆదివారాల్లో సెలవు తీసుకోరాదు’

image

పార్వతీపురంలోని 15 సచివాలయాల్లో రికార్డ్ పెండింగ్ పనులను పూర్తి చేసే దిశగా ఉద్యోగులు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. రికార్డు పెండింగ్ ఉన్న శని, ఆదివారాల్లో ఆ సచివాలయాల్లో ఉద్యోగులంతా తప్పకుండా విధులకు హాజరై రికార్డులు పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు శని, ఆదివారాల్లో ఈ సర్వే పెండింగ్ ఉన్న ఏ సచివాలయాలను అయినా ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశం ఉందన్నారు.

News April 5, 2025

రాజమండ్రి: గర్భిణిగా నాటకం ఆడిన మహిళ.. ఏమైందంటే?

image

గొడ్రాలు అనే నింద పడుతుందనే భయంతో ఓ వివాహిత గర్భణిగా నాటకం ఆడింది. పోలీసులు వివరాల ప్రకారం..దేవిపట్నం(M) ఇందుకూరిపేటకి చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణిని గురువారం డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. తాను గర్భిణి కాదని తెలుస్తుందనే భయంతో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. కాకినాడలో ఆమె ఆచూకీ గుర్తించి విచారించగా.. 9నెలలు గుడ్డ ముక్కలు పెట్టుకుని గర్భం పెరుగుతున్నట్లు నమ్మించినట్లు ఆమె తెలిపింది.

News April 5, 2025

బాక్సాఫీస్ ‘WAR’.. రజినీVSహృతిక్-ఎన్టీఆర్

image

రజినీకాంత్ ‘కూలీ’, హృతిక్-NTR నటిస్తున్న ‘వార్-2’ ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానున్నాయి. దీంతో సౌత్‌లో ఏ సినిమా డామినేట్ చేస్తుందనే చర్చ మొదలైంది. ‘వార్-2’ కంటే ‘కూలీ’కే ఆడియన్స్ మొగ్గు చూపొచ్చన్నది నెటిజన్ల అభిప్రాయం. రజినీ, నాగార్జునతో పాటు లోకేశ్ కనగరాజ్ ఆ సినిమాకు బలమని.. ‘వార్-2’ను హిందీ డైరెక్టర్ తెరకెక్కించడం, అది NTR సోలో ఫిల్మ్ కాకపోవడంతో కాస్త డిమాండ్ తక్కువ ఉండొచ్చని అంటున్నారు.

error: Content is protected !!