News December 9, 2025

జనగామ: ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష

image

తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై నేడు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎంపీడీవోలతో గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి మండలంలో ఓటింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ వంటి అంశాలను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.

Similar News

News December 12, 2025

అనఘాష్టమి వ్రత విధానం

image

పూజా మందిరంలో పీఠంపై దత్తాత్రేయుడు చిత్రపటాన్ని పూలతో అలంకరించాలి. అష్టదళ పద్మం వేసి, దానిపై కలశం ఉంచి, ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. మొదట గణపతి పూజ చేయాలి. అనంతరం అనఘస్వామిని ఆరాధించాలి. పగటిపూట నిద్రించకూడదు. ఉపవాసం ఉండాలి. ‘ఓం దత్తాత్రేయాయ నమః’ అని స్మరించాలి. రాత్రిపూట సాత్వికాహారం తీసుకోవాలి. వ్రతం పూర్తయ్యాక దక్షిణ, తాంబూలం, వ్రత పుస్తకాలు ఇవ్వాలి. ఈ వ్రతం మహిళలు ఎవరైనా చేయవచ్చు.

News December 12, 2025

వనపర్తి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

వనపర్తి జిల్లాలో 87 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 84.94 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

భద్రాద్రి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 159 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 71.79 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.