News March 25, 2025
జనగామ: ‘ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

జనగామ పట్టణ పరిధిలో ఉన్న ఫ్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)ను ఈ నెల 31 వరకు చేసుకునే అవకాశం ఉందని జిల్లా అధికారులు తెలిపారు. 25% డిస్కౌంట్‌తో ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని పట్టణ వాసులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మళ్లీ క్రమబద్ధీకరణ తేదీని పెంచే అవకాశం లేదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News November 4, 2025
విజయనగరంలోనూ భూప్రకంపనలు?

విశాఖ, అల్లూరి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున పలు చోట్ల భూమి కంపించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో <<18192060>>భూకంపం<<>> నమోదైనట్ల మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తన వెబ్‌సైట్‌లో మంగళవారం పొందుపరిచింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 పాయింట్ల తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. విజయనగరంలోనూ పలుచోట్ల భూమి కంపించినట్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు.
News November 4, 2025
సిరిసిల్ల: ‘పోషిస్తానని చెప్పి.. వెళ్లగొడుతున్నాడు’

రాజరాజేశ్వర జలాశయ ముంపు బాధితులైన కడుగుల రుక్కమ్మ–మల్లయ్య దంపతులు సోమవారం సిరిసిల్ల ప్రజావాణిలో ఇన్ఛార్జి కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు. పరిహారంగా వచ్చిన రూ. 7.50 లక్షలను తమ సొంత చెల్లెలి కొడుకు తీసుకున్నాడని, పోషిస్తానని చెప్పి ఇప్పుడు ఇంటి నుంచే వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమకు న్యాయం చేయాలని, తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని వారు వేడుకున్నారు.
News November 4, 2025
MHBD: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 3 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ రాజు అనే వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. 3 రోజుల క్రితం బతికి ఉన్న రాజును వైద్య సిబ్బంది మార్చురీలో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా రాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే రాజు మృతి చెందాడని ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


