News March 7, 2025
జనగామ: ఎల్ఆర్ఎస్‌పై హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

ఎల్ఆర్ఎస్‌కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ తెలిపారు. ఎస్ఎంఎస్ రాకపోయినా హెల్ప్ డెస్క్‌ల ద్వారా సమాచారం పొందవచ్చునన్నారు. సందేశాల నివృత్తికి కలెక్టరేట్లో సహాయ కేంద్రం నంబర్ 9948187334, జనగామ పురపాలక సహాయ కేంద్రం నంబర్ 8978207205ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Similar News
News March 26, 2026
జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నేడు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలులో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నవించారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా నియోజకవర్గంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, దేవాలయాల అభివృద్ధి పనులకు తగిన గ్రాంట్లు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.
News March 26, 2026
సంగారెడ్డి: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ప్రావీణ్య గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ ప్రొఫైల్ నమోదు, డేటా ఎంట్రీ తదితర వివరాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
News March 26, 2026
EVM, VVప్యాట్ల గోదాముల్లో కలెక్టర్ పరిశీలన

EVM, VVప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించినప్పటికి నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని సమన్వయ శాఖల అధికారులను కలెక్టర్ లక్ష్మీశ అదేశించారు. గురువారం గొల్లపూడిలోని EVM, VVప్యాట్ల గోదామును పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు.


