News October 26, 2025
జనగామ: ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టుల దరఖాస్తులకు నేడే ఆఖరు

జిల్లాలోని కస్తూర్బాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆదివారం ఆఖరు తేదీ అని ఇన్‌ఛార్జి డీఈవో పింకేశ్ కుమార్ తెలిపారు. రఘునాథపల్లి, తరిగొప్పుల కేజీబీవీల్లో ఒక్కో ఏఎన్ఎం పోస్టు, దేవరుప్పుల, నర్మెట్టలో ఒక్కో అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు నేడు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News October 28, 2025
వరంగల్ మెట్ల బావిని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

కాకతీయుల వారసత్వానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక వరంగల్ మెట్ల బావిని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. స్థానిక ప్రజల సమక్షంలో ఆమె బావిని ప్రారంభించి నీటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. కాకతీయుల శిల్పకళను కాపాడటం మనందరి బాధ్యత అని తెలిపారు. సొరంగ మార్గం ద్వారా రుద్రమదేవి ఈ బావికి వచ్చేదని ప్రతీతి అని గుర్తు చేశారు.
News October 28, 2025
గోదావరిఖని: RTC స్పెషల్ యాత్ర క్యాలెండర్

గోదావరిఖని RTC డిపో ఆధ్వర్యంలో NOV యాత్ర క్యాలెండర్‌ను ప్రకటించినట్లు DM నాగభూషణం ఓ ప్రకటనలో తెలిపారు. NOV 4న- యాదగిరి గుట్ట, స్వర్ణగిరి, కొలనుపాక, 6న- శ్రీశైలం, 11న- పళని, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, జోగులాంబ, 18న- శ్రీశైలం, 23న- రాంటెక్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య, మైహర్, చాందా మహంకాళి క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News October 28, 2025
కళ్ల కింద డార్క్ సర్కిల్స్.. ఇలా మాయం

ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, నిద్రలేమి, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల మహిళల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఈ సమస్యకు ఇంట్లోని పదార్థాలతోనే సహజంగా తగ్గించుకోవచ్చు. పచ్చి పాలు/బంగాళదుంప రసంలో దూదిని ముంచి కళ్ల కింద పెట్టి 20ని. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు 2సార్లు ఇలా చేయాలి. బంగాళదుంప/కీరా ముక్కను కళ్లకింద 10ని. రుద్ది నీటితో కడిగేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.


