News August 23, 2025

జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ కేడేట్ల ఎంపిక

image

జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఆర్మీ పదో బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ కేడెట్ల ఎంపిక శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎత్తు, బరువు కొలతలతో పాటు పరుగు పందెం, పుష్ అప్స్, వైద్య, రాత పరీక్షలు నిర్వహించారు. పేర్కొన్న పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులను కేడేట్లుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ అధికారులు, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 24, 2025

కామారెడ్డి: కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలి

image

పెండింగులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని జిల్లా న్యాయ సేవా అథారిటీ ఛైర్మన్ వరప్రసాద్ సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో సాధ్యమైన అన్ని కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొన్నారు.

News August 24, 2025

100 దేశాలకు భారత్‌ నుంచి EVల ఎగుమతి: మోదీ

image

100 దేశాలకు EVలు ఎగుమతి చేసిన అరుదైన మైలురాయిని భారత్ అందుకోనుందని వరల్డ్ లీడర్ ఫోరమ్‌లో PM మోదీ అన్నారు. 2014 వరకు ఏటా ఆటోమొబైల్ ఎగుమతుల విలువ రూ.50వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. భారత్ ఇప్పుడు మెట్రో కోచ్‌లు, రైల్ కోచ్‌లు, లోకోమోటివ్స్ ఎగుమతిని ప్రారంభించిందని పేర్కొన్నారు. 100దేశాలకు ఎగుమతుల మైలురాయికి గుర్తుగా ఎల్లుండి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

News August 24, 2025

మోడల్ స్కూల్లో కమిటీల ప్రమాణస్వీకారం

image

చిన్నశంకరంపేట మోడల్ స్కూల్‌లో స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌసెస్ క్యాప్టెన్, వైస్ కెప్టెన్, కల్చరల్, డిసిప్లేన్ కమిటీల ఇన్‌ఛార్జుల ప్రమాణ స్వీకారం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ వాణి కుమారీ తెలిపారు. కార్యక్రమానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శశిధర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దీప్లా రాథోడ్, కమిటీ ఫీర్మన్ స్రవంతి హాజరయ్యారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రదర్శన ఆకట్టుకుంది.