News December 22, 2025

జనగామ: ఒకే బడి.. ఒకే తరగతి.. ముగ్గురు విజేతలు!

image

జిల్లాలోని రఘునాథపల్లిలో ముగ్గురు బాల్య స్నేహితుల విజయం ఆకర్షణగా నిలిచింది. ఒకే బడి, ఒకే తరగతిలో చదువుకున్న కడారి మహేందర్, బాలగోని శ్రీనివాస్, సమ్మయ్య వేర్వేరు వార్డుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తాము, ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని వారు చెబుతున్నారు. తమపై నమ్మకముంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు.

Similar News

News December 23, 2025

రేపు మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన

image

రేపు మెదక్ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చేగుంట మండల కేంద్రంలో గల రైతు వేదికలో మంత్రి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

News December 23, 2025

నాగర్‌కర్నూల్‌: టెట్‌ కోసం ఉపాధ్యాయుల పుస్తకాల కుస్తీ

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టెట్‌ (TET) ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో ఉమ్మడి జిల్లాలోని సుమారు 5,600 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జనవరి 3 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షల కోసం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొందుతూ సన్నద్ధమవుతున్నారు. పాఠశాల విధులతో పాటు పరీక్షల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

News December 23, 2025

GWL: హక్కులపై అవగాహన ఉండాలి: ప్రిన్సిపల్‌

image

వినియోగదారులు తమ హక్కులను ఆయుధంగా మలుచుకున్నప్పుడే మార్కెట్‌లో మోసాలను అరికట్టవచ్చని ఎంఏఎల్‌డీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.కలందర్‌ బాషా అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం గద్వాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘ఆస్రా’ బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలు వినియోగదారుల చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.