News January 31, 2025
జనగామ: కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

జనగామ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో కంది పంట కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కంది పంట సాగు చేసిన రైతులు రాష్ట్ర ప్రభుత్వం మార్కుఫెడ్ ద్వారా క్వింటాకు మద్దతు ధర రూ.7,550లు కల్పించి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పంటను ప్రమాణాల కనుగుణంగా శుభ్రపరచి AEO వద్ద ధ్రువీకరణ, పట్టాదారు పాసుబుక్, ఆధార్, బ్యాంకు జిరాక్స్ తీసుకురావాలన్నారు.
Similar News
News November 6, 2025
HYD: సజ్జనార్ సార్.. GUN FIRED

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇవాళ గన్ ఫైర్ చేశారు. నేరస్థుల గుండెల్లో కాదులెండీ తెలంగాణ పోలీస్ అకాడమీలోని బుల్స్‌ఐపై.. అకాడమీలో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు సిటీ పోలీస్ బృందంతో కలిసి హాజరయ్యారు. ఫైరింగ్ రేంజ్లో ఉండటం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని, బుల్స్‌ఐని ఎయిమ్ చేయడం ఎప్పుడూ నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని సీపీ Xలో ట్వీట్ చేశారు.

ప్రకాశం జిల్లాలో 213 వాహనాలకు జరిమానా

ప్రకాశం వ్యాప్తంగా బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2,044 వాహనాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 213 వాహనాలను గుర్తించి రూ.1.56లక్షల జరిమానా విధించారు. డ్రైవింగ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు.