News October 20, 2025
జనగామ: కడుపు నింపుతున్న అమ్మలు.. గిట్టుబాటు కాక అప్పులు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం వండి పెడుతున్న వంట ఏజెన్సీ మహిళలు విద్యార్థులను తమ కన్నబిడ్డల్లా భావించి కడుపు నింపుతున్నారు. బిల్లులు రాకున్నా అప్పులు తెచ్చి మరీ కడుపునిండా వండి పెడుతున్నారు. జిల్లాలోని పాఠశాలల్లో 910 మంది వంట చేసే మహిళలు ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులకు అయ్యే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. వారికి చెల్లించే గౌరవ వేతనం ఏమాత్రం సరిపోక కడుపులు మాడ్చుకుంటున్నారు.
Similar News
News October 20, 2025
హనుమకొండ: 11 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి పేకాడుతున్న 11 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. నిందితుల నుంచి రూ.1.23 లక్షల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
News October 20, 2025
MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 2/2

పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతిరూపమే ఇక్కడి స్వామివారని భక్తుల నమ్మకం. పాలమూరు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
News October 20, 2025
MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 1/2

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట (M) కురుమూర్తిలో ఉన్న దేవాలయం ఉమ్మడి జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. కాంచనగుహగా పేరొందిన కురుమూర్తి కొండలలోని వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు. సా.శ.1268 కాలంలో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. Way2News ప్రత్యేక కథనం.