News October 19, 2025

జనగామ: కపాస్ కిసాన్ యాప్‌ను వినియోగించాలి: డీఏఓ

image

పత్తి పంటను సాగు చేసిన రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో సాగు చేసిన పంట విస్తీర్ణం వివరాలను నమోదు చేసుకోవాలని జనగామ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోని తెలిపారు. ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్న రైతులకు పత్తి విక్రయాల్లో పారదర్శకత ఉంటుందని స్పష్టం చేశారు. కావున రైతులు ఈ యాప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 19, 2025

KNR: ‘పెద్దల సమక్షంలోనే క్రాకర్స్ పేల్చాలి’

image

దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సూచించారు. ప్రజలు సమగ్ర భద్రతా నియమాలు పాటిస్తూ అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన కోరారు. చిన్నపిల్లలు పెద్దల సమక్షంలోనే టపాసులు పేల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

News October 19, 2025

లొద్ద అందాలను ‘క్లిక్’ మనిపించిన కలెక్టర్

image

సాలూరు మండలం గిరిశిఖర పంచాయతీ కొదమ పంచాయతీ లొద్ద అందాలను పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి స్వయంగా తన సెల్ ఫోన్లో బంధించారు. ఆదివారం ఉదయం లొద్ద ప్రాంతం చూడటానికి బయలుదేరారు. కలెక్టర్ వాహనం పైకి వెళ్లకపోవడంతో కమాండర్ జీపుతో లొద్ద జలపాతం వద్ద చేరుకున్నారు. ఈ క్రమంలో పకృతి అందాలను ఫొటోలు తీశారు.

News October 19, 2025

UKలో ఉండటంపై విరాట్ ఏమన్నారంటే?

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొన్ని నెలలుగా ఫ్యామిలీతో కలిసి UKలో ఉంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ్టి మ్యాచ్‌కు ముందు ఆయన స్పందించారు. ‘టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత నాకు చాలా సమయం దొరికింది. జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు కుటుంబంతో కొంత సమయం గడపగలుగుతున్నా. ఇది ఒక అందమైన దశ. చాలా ఆనందంగా ఉన్నా. ఫ్రెష్‌గా, ఫిట్‌గా ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు.