News February 15, 2026

జనగామ కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు

image

జనగామ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు (ఫిబ్రవరి 16) రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రేపు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉండడం, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు‌ జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News February 19, 2026

వంటింటి చిట్కాలు మీ కోసం

image

* కూరగాయలు వడలిపోయినట్టు అయితే, నీటిలో వేసి నిమ్మరసం పిండితే కాసేపటికి తాజాగా మారతాయి. * వంటకాల్లో ఉల్లివాసన ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాటిని వేయించే ముందు కొద్దిగా పంచదార వేయాలి. * పూరీలు మృదువుగా రావాలంటే పిండిని వేడి నీళ్ళూ, పాలతో కలిపి అరగంట సేపు రుమాలులో చుట్టి ఉంచాలి. * పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే, తోడుకున్నాక దానిపై ఒకటి రెండు చిన్న కొబ్బరి ముక్కల్ని ఉంచండి.

News February 19, 2026

సిద్దిపేట: రూ.500 గ్యాస్ రాయితీ.. ఎదురుచూపులు!

image

సిద్దిపేట జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు రూ.500 రాయితీ డబ్బులు కోసం 6 నెలలుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్‌ను అమలు చేస్తుంది. అయితే పథకం ప్రారంభంలో ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ చేసినా 6 నెలలుగా జమ కావడం లేదని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. జిల్లాలో 79 వేల లబ్ధిదారులు ఉన్నారు. మరి మీకు సబ్సిడీ పడుతుందా కామెంట్.

News February 19, 2026

గర్ల్‌ఫ్రెండ్‌తో పూల్‌లో హార్దిక్ పాండ్య.. ఫొటో వైరల్

image

తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మకు బర్త్‌డే విషెస్ చెబుతూ క్రికెటర్ హార్దిక్ పాండ్య పోస్ట్ చేసిన ఫొటో వైరలవుతోంది. స్విమ్మింగ్ పూల్‌‌లో ఆమెతో క్లోజ్‌గా ఉన్న ఫొటోను హార్దిక్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ప్రిన్సెస్’ అని పేర్కొన్నారు. కాగా గత ఏడాది OCTలో మహీకాతో రిలేషన్‌షిప్‌ను హార్దిక్ కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచి ఆమెతో కలిసి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.