News April 3, 2025

జనగామ: కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఆర్టీఏ నెంబర్

image

జనగామకి చెందిన చిలువేరి అభి గౌడ్ జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీసీపీ మహేంద్ర నాయక్, సీఐ దామోదర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం తరఫున, రవాణా శాఖకు సంబంధించి అన్ని రకాలుగా అవగాహన కల్పించడంతో పాటు అందరూ బాధ్యతాయుతంగా ఉండేలా చేసుకోవాలని అధికారులు వారికి సూచించారు.

Similar News

News March 2, 2026

పల్నాడు: నేడు కలెక్టరేట్‌లో PGRS

image

కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News March 2, 2026

7 ఎమిరేట్స్ సమాఖ్య దేశమే UAE

image

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి. <<19276017>>UAE<<>> 7 ఎమిరేట్స్ అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రస్ అల్ ఖైమా, ఫుజైరాల సమాఖ్య దేశం. 1971లో 6 ఎమిరేట్స్ ఓ గ్రూపుగా ఏర్పడగా 1972లో ఫుజైరా జాయిన్ అయింది. వీటికి సపరేట్‌గా ఏడుగురు చీఫ్‌లున్నా అబుదాబి అధినేతే UAEకి అధ్యక్షుడిగా ఉంటారు. ఈ దేశ విస్తీర్ణంలో పెద్దదై(84-87%)న అబుదాబి, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ దుబాయ్‌లదే UAEలో ఆధిపత్యం.

News March 2, 2026

తూ.గో: మళ్లీ పులి కలకలం.. ట్విస్ట్ ఏంటంటే..!

image

గోకవరం మండలంలో పులి సంచరిస్తోందన్న పుకార్లతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలో రాయవరం వద్ద పట్టుబడిన పులిని మారేడుమిల్లి అడవుల్లో విడిచిపెట్టగా, అది మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే అటవీశాఖ అధికారులు తనిఖీలు చేసి పులి జాడ లేదని స్పష్టం చేశారు. సారా వ్యాపారులు తమ అక్రమ దందాల కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు.