News October 30, 2025

జనగామ కలెక్టర్‌ను కలిసిన డీపీఓ

image

జనగామ జిల్లా పంచాయతీ అధికారిగా ఎ.నవీన్ గురువారం కలెక్టరేట్లోని డీపీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ అధికారులు, డీపీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు.

Similar News

News October 30, 2025

మెదక్: రైతులకి ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

image

ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకి ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలి ఘనపూర్ మండలం శాలిపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

News October 30, 2025

TML: నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు..!

image

TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి PA చిన్న అప్పన్న నుంచి సిట్ కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ‘TTDకి నెయ్యి పంపే బోలేబాబా కంపెనీకి అప్పన్న ఫోన్ చేసి KGకి రూ.25 కమీషన్ ఇవ్వాలని కోరగా ఆ సంస్థ నిరాకరించింది. అప్పన్న ఒత్తిళ్లతో బోలేబాబా కాంట్రాక్ట్‌ రద్దైంది. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ బోలేబాబా కంటే KGకి రూ.138 ఎక్కువగా టెండర్ దక్కించుకుని అప్పన్నకు రూ.50లక్షలు ముడుపుగా ఇచ్చింది’ అని సిట్ తేల్చిందంట.

News October 30, 2025

MBNR: ‘బీసీ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలి’

image

పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో గురువారం జరిగిన బీసీల కార్యాచరణ సభకు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.