News February 26, 2026
జనగామ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

జనగామ నూతన కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే తన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
Similar News
News February 28, 2026
కడప జిల్లాలో నేటి ఇంటర్ పరీక్షలకు 4,470 మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ బాటనీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,626 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,470 మంది రాశారు. 156 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 3,473 మందికి గాను.. 3,383 మంది పరీక్షలకు హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,153 మందికి గాను.. 1,087 మంది పరీక్షలు రాశారు. 66 మంది ఆబ్సెంట్ అయ్యారు.
News February 28, 2026
స్టే.ఘ: నిజంగా ఆ స్వామి చూసినట్లే!

కలియుగ దైవమైన ఆ వేయి నామాల వెంకటేశ్వరుడే కళ్లముందు కదలాడినట్లే అనిపించింది ఆ ఒక్క క్షణం. జనగామ జిల్లా చిల్పూరు గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ వేడుకల్లో ఓ యువతిని వెంకటేశ్వర స్వామి వేషాధరణలో అలంకరించి కళ్యాణ మండపం వద్ద ఉంచగా నిజంగా స్వామివారి చూసినట్లేనని ఉందని చూసినవారు అనుకున్నారు.
News February 28, 2026
అనకాపల్లి జిల్లాకు భారీ పరిశ్రమ.. వద్దంటూ ఆందోళన

సీతపాలెం సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటును నిలుపుదల చేయాలని పూడిమడక అఖిలపక్ష నాయకులు, మత్స్యకారులు శనివారం కోరారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో గల ఏపీ సెజ్‌లో ఏర్పాటైన ఫార్మా కంపెనీలు నుంచి విడుదల అవుతున్న వాయుకాలుష్యం, జల కాలుష్యం వలన పూడిమడక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు ఈ బ్లూ జెట్ ఫార్మా ఏర్పాటు వల్ల మరింత నష్టం జరుగుతుందని చెప్పారు.


