News July 9, 2025

జనగామ: కష్టపడి ఈ స్థాయికి వచ్చా: డీఈఓ

image

కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని జనగామ డీఈఓ భోజన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాడు సౌకర్యాలు లేకున్నా కష్టపడి చదివానని, నేడు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Similar News

News July 9, 2025

‘ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

image

VMRDAకి చెందిన అన్ని కళ్యాణ మండపాల బుకింగ్‌లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. బుధవారం VMRDA బాలల థియేటర్లో ఆయన ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ప్రజలకు VMRDA సేవలు పారదర్శకంగా కల్పించేందుకు ఆన్లైన్ సేవలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్‌లోనే కళ్యాణమండపం రుసుము, తదితర వివరాలు ఉంటాయని పేర్కొన్నారు.

News July 9, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిన సార్వత్రిక సమ్మె
> ఆకట్టుకున్న బాంజీపేట ప్రభుత్వ పాఠశాల
> జనగామ డీటీఓగా హుస్సేన్ బాధ్యతల స్వీకరణ
> రఘునాథపల్లి: రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
> పాలకుర్తి ఎంపీడీవోగా రవీందర్ బాధ్యతల స్వీకరణ
> ఇప్పగూడెం జడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
> బతుకమ్మ కుంట నెల రోజులు మూసివేత
> జనగామ ఎమ్మెల్యేను పరామర్శించిన ఎంపీ

News July 9, 2025

మైనింగ్ బ్లాక్‌పై ఫిర్యాదులు.. స్పందించిన పవన్

image

AP: విజయనగరంలో దేవాడ మైనింగ్ బ్లాక్‌ విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మాంగనీస్ తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాలను పరిగణించలేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో ఆ జిల్లా అధికారులతో పవన్ చర్చించారు. మైనింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.