News October 21, 2025
జనగామ: కార్యాలయం ఉన్నా.. చేయూత సున్నా!

యువతలోని నైపుణ్యాలను పెంపొందించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన యువజన కార్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో యువజన కార్యక్రమాల నిర్వహణ కరవైంది. జనగామ జిల్లాలో 1,89,000 మంది యువత ఉన్నప్పటికీ స్థానిక యువతకు మాత్రం సంబంధిత శాఖ నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడం గమనార్హం.
Similar News
News October 21, 2025
VZM: ‘పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకోవాలి’

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న స్మృతి వనంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, ఎస్పీ దామోదర్ పాల్గొని అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు.
News October 21, 2025
కురుమూర్తి రాయుడికి పట్టు వస్త్రాల తయారీ

కురుమూర్తి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సమర్పించేందుకు పట్టు వస్త్రాలు సిద్ధమవుతున్నాయి. ఉత్సవాల్లో రెండో ఘట్టమైన అలంకరణ ఉత్సవం రోజున ఈ వస్త్రాలు స్వామివారికి సమర్పించనున్నారు. ఆనవాయితీగా అమరచింత చేనేత కళాకారులు పట్టు వస్త్రాలను సమర్పించడం 66 ఏళ్లుగా కొనసాగుతోంది. అప్పట్లో గ్రామానికి చెందిన కొంగరి చెన్నయ్య అనే వ్యక్తి స్వామికి పట్టు వస్త్రాల మొక్కుబడి ఇప్పటికి ఉంటడం విశేషం.
News October 21, 2025
పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: జనగామ కలెక్టర్

పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ముందుగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు.