News February 23, 2025
జనగామ: కేంద్రాల వారీగా విద్యార్థులు ఇలా!

జనగామ జిల్లా వ్యాప్తంగా నేడు జరగనున్న ఉమ్మడి గురుకులాల ప్రవేశ పరీక్షకు 9 కేంద్రాలను కేటాయించారు. ఇందులో బీసీ గురుకులాలైన మహాత్మా జ్యోతిబా పూలే పరీక్ష కేంద్రాల్లో కేవలం 89 మంది మాత్రమే రాస్తుండగా.. మిగతా వారు ఎస్సీ సంక్షేమ గురుకులాల్లోనీ కేంద్రాల్లో రాస్తున్నారు. ఇందుకోసం 9 మంది చీఫ్ సూపరింటెండెంట్, 9 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను నియమించారు.
Similar News
News December 14, 2025
శ్రీ సత్యసాయి: కెప్టెన్ దీపిక ఇంటికి చేరిన పవన్ కానుకలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ <<18548058>>దీపిక<<>> కుటుంబానికి టీవీ, ఫ్యాన్, గృహోపకరణాలు, నిత్యావసరాలు, వస్త్రాలను అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ చేతుల మీదుగా అందించారు. అలాగే తమ ఊరు తంబలహట్టి తండాకు రోడ్లు బాగాలేవని దీపిక ఆవేదన వ్యక్తం చేయగా వెంటనే రూ.6.2 కోట్లతో నూతన రోడ్లు మంజూరు చేశారు. రూ.5లక్షల చెక్కును దీపికకు అందజేసి భరోసా ఇచ్చారు.
News December 14, 2025
అరక అరిగిన గరిసె విరుగును

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.
News December 14, 2025
ఆడవాళ్లు జుట్టు విరబోసుకొని ఆలయాలకు వెళ్లవచ్చా?

శాస్త్రాల ప్రకారం.. స్త్రీలు దేవాలయాలకు వెళ్లేటప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్లకూడదు. ఈ చర్యను అపవిత్రంగా భావిస్తారు. అలాగే ఇది భగవంతుడికి అపచారం చేసినట్లవుతుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల కొన్ని దోషాలు కూడా కలుగుతాయని అంటున్నారు. పూజలు, ఆలయాల్లో పవిత్రత, శుచి, శుభ్రతలను పాటించాలని, గుళ్లకు వెళ్లే స్త్రీలు జుట్టును శుభ్రంగా ముడివేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే దైవ కృప లభిస్తుందంటున్నారు.


