News November 19, 2025
జనగామ: గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి

జనగామ జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించడంతో జిల్లాలోని 281 గ్రామాలలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లనుంది.
Similar News
News April 1, 2026
ఇరాన్ యుద్ధం.. అమెరికాతో విభేదించిన బ్రిటన్

ఇరాన్ యుద్ధం విషయంలో <<19525908>>అమెరికా<<>>తో బ్రిటన్ విభేదించింది. ఈ ఘర్షణల్లోకి ప్రవేశించేది లేదని PM స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంతో సంబంధం లేనప్పటికీ.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఘర్షణల్ని ఆపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హార్ముజ్ పున:ప్రారంభానికి ఉన్న మార్గాల్ని అన్వేషించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.
News April 1, 2026
విశాఖ రైల్వే డివిజన్‌కు మరో రికార్డు

వాల్తేరు రైల్వే డివిజన్ మరోసారి రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం సాధించిన డివిజన్లలో 5వ స్థానం, వృద్ధిలో తొలి స్థానం దక్కించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 85.1 మిలియన్ టన్నుల లోడింగ్‌తో 17.25% వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం రూ.11,598 కోట్లకు చేరి 17% పెరిగింది. ప్రయాణికుల సంఖ్య 33.42Mకి చేరగా రూ.881 కోట్ల ఆదాయం లభించింది. ఈ వివరాలను వాల్తేరు డివిజన్ DRM లలిత్ బోహ్రా వెల్లడించారు.
News April 1, 2026
కూతురిని చూసేందుకు వెళ్తూ.. అనంత లోకాలకు!

కరప మండలం పెనుగుదురు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తిని గుత్తుల రామకృష్ణ(60)గా పోలీసులు గుర్తించారు. ఆయన కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామానికి చెందినవారు. తూరంగిలోని తన కూతురును చూడడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ సునీత తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిజిహెచ్ కు తరలించినట్లు వెల్లడించారు.


