News August 16, 2025
జనగామ: జాతీయ స్థాయి క్రీడాకారిణికి ప్రశంసా పత్రం!

జాతీయ స్థాయి క్రీడల్లో గెలుపొందుతూ జనగామ జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న క్రీడాకారిణి కృష్ణవేణి ప్రశంసా పత్రం అందుకుంది. జనగామలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో శుక్రవారం అందించారు. స్టే.ఘ. మండలం విశ్వనాధపురానికి చెందిన కృష్ణవేణి జాతీయ క్రీడల్లో విజయం సాధిస్తూ జిల్లాకు గుర్తింపు తీసుకొస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ ప్రశంసా పత్రం అందించారు.
Similar News
News August 16, 2025
‘వార్-2’ రెస్పాన్స్‌పై NTR ట్వీట్

‘వార్-2’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మేము చాలా ప్యాషన్‌తో తీసిన సినిమాకు ప్రజల నుంచి వస్తోన్న మద్దతు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆయన రాసుకొచ్చారు. కాగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘వార్-2’ రెండు రోజుల్లో రూ.150కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని సినీవర్గాలు తెలిపాయి.
News August 16, 2025
రేపు పుట్టపర్తికి రానున్న మాజీ క్రికెటర్లు

శ్రీ సత్యసాయి బాబా హిల్ వ్యూ స్టేడియంలో రేపు జరిగే యూనిటీ కప్ ఫైనల్స్‌కి విశేష అతిథులుగా మాజీ జాతీయ క్రికెటర్లు హాజరుకానున్నారు. సునీల్ జోషి, అమోల్ ముజుందార్, మురళి కార్తీక్, MSK ప్రసాద్, శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తరలిరానన్నారు. ఫైనల్ మ్యాచ్‌ను వీరు వీక్షించనున్నారు.
News August 16, 2025
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండండి: మంత్రి కొండా

ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాలోని సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.