News March 10, 2025

జనగామ జిల్లాకు రూ.200 కోట్లు

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 10, 2025

మిర్యాలగూడ: కోర్టు తీర్పు.. పేరెంట్స్, అమృత భావోద్వేగం

image

మిర్యాలగూడ <<15710555>>ప్రణయ్ హత్య<<>> కేసులో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 కరీం, A6 శ్రావణ్, A7 శివ, A8 నిజాంకు యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది. కాగా తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు. కాగా ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు.

News March 10, 2025

క్రోమ్‌ను గూగుల్ అమ్మేయాల్సిందే: DOJ

image

క్రోమ్ బ్రౌజర్‌ను అమ్మేయాలని గూగుల్‌కు DOJ మరోసారి స్పష్టం చేసింది. కోర్టు గత ఏడాది ఆదేశించినట్టుగా ఆన్‌లైన్ సెర్చ్‌లో అక్రమ గుత్తాధిపత్యానికి తెరదించాలని వెల్లడించింది. ఏ సెర్చ్ ఇంజిన్‌ను ఎంచుకోవాలన్న హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేసింది. యాపిల్, మొజిల్లా సహా ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ప్రీ ఇన్‌స్టాల్ ఒప్పందాలు చట్టవిరుద్ధమని తెలిపింది. 2021లో వీరికి గూగుల్ $26.3B ఇచ్చినట్టు ఆధారాలు దొరికాయి.

News March 10, 2025

మిర్యాలగూడ: కోర్టు తీర్పు.. పేరెంట్స్, అమృత భావోద్వేగం 

image

మిర్యాలగూడ <<15710555>>ప్రణయ్ హత్య<<>> కేసులో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 కరీం, A6 శ్రావణ్, A7 శివ, A8 నిజాంకు యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది. కాగా తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు. కాగా ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు.

error: Content is protected !!