News December 26, 2025

జనగామ జిల్లాలో టాప్ న్యూస్

image

> ఈనెల 31న పాలకుర్తి సోమేశ్వరాలయంలో బహిరంగ వేలం: ఈవో
> బచ్చన్నపేట: గుండెపోటుతో జిపిఓ మృతి
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
> జిల్లాలో యూరియా కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్న రైతన్నలు
> రేపు కట్కూర్ లో పామాయిల్ సాగుపై అవగాహన సదస్సు
> జనగామ: మహిళ కబడ్డీ టీం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లేయింగ్ కిట్లను పంపిణీ చేశారు.

Similar News

News December 27, 2025

గద్వాల: సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వీరే..!

image

గద్వాల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో శుక్రవారం కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో గద్వాల మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కొండపల్లి సర్పంచ్ కృష్ణారెడ్డి, ధరూర్ మండలం అధ్యక్షుడిగా విజయ్, కేటీ దొడ్డి మండల అధ్యక్షురాలుగా సోంపురం సరోజమ్మ, గట్టు మండల అధ్యక్షుడిగా శ్రీరామ్ గౌడ్, మల్దకల్ మండల అధ్యక్షుడిగా తూమ్ కృష్ణారెడ్డిని ఆయా గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

News December 27, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} సత్తుపల్లిలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News December 27, 2025

జనవరి 10న PSLV-C62 ప్రయోగం

image

AP: PSLV-C62 రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని SDSC సిద్ధమవుతోంది. ఈ రాకెట్ ద్వారా EOS-N1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. వ్యవసాయం, భూ పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ తదితరాలను ఉద్దేశించి ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది. దీంతో పాటు ఓ వర్సిటీ రూపొందించిన శాటిలైట్, అమెరికాకు చెందిన ఓ చిన్న ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపనున్నారు. ఇటీవల ఇస్రో చేపట్టిన బ్లూబర్డ్ ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలిసిందే.