News February 21, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి: అడిషనల్ కలెక్టర్
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
> ఓవర్ లోడుతో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసిన రవాణా అధికారులు
> ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలపై జిల్లా కలెక్టరేట్లో సమావేశం
> తేనెటీగల దాడిలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
> పాలకుర్తి శ్రీ సోమేశ్వర ఆలయ ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్
Similar News
News February 22, 2025
సిరిమాను చెట్టును ఊరేగించేందుకు ఏర్పాట్లు

శ్రీ శ్యామలాంబ అమ్మవారి సిరిమాను చెట్టును అల్లువీధి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు 30 జతల ఎద్దులతో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి శ్రీ శ్యామలాంబ అమ్మవారి గుడి మీదుగా శివాజీ సెంటర్, బోసు బొమ్మ జంక్షన్, డబ్బివీధి, కోట జంక్షన్, NTR బొమ్మ జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా అల్లు వీధికి చేర్చనున్నారు. ఈ సందర్భంగా కోలాటం, తప్పెటగుళ్ల ప్రదర్శన ఉంటుందని కమిటీ తెలిపింది.
News February 22, 2025
మహా కుంభాభిషేకానికి కేసీఆర్‌కు ఆహ్వానం

రేపు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి రావాలని మాజీ సీఎం కేసీఆర్‌ను ఆలయ పూజారులు కలిసి ఆహ్వానం అందించారు. అలాగే మార్చి 1 నుంచి 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈవో భాస్కర్, ముఖ్య అర్చకులు తదితరులు ఉన్నారు. కాగా, గతంలో పలు కార్యక్రమాలకు ఆహ్వానించినా కేసీఆర్ హాజరు కాలేదు. ఇప్పుడైనా వెళ్తారా అనేది చూడాలి.
News February 22, 2025
కాళేశ్వరంలో ఘనంగా సాగుతున్న పరిశుద్ధ్య పనులు

మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మహాశివరాత్రికి ప్రత్యేక పరిశుద్ధ్య పనులు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. శనివారం పుష్కర ఘాట్ ఆవరణంలో అక్కడ ఉన్న చెత్త చదరంగం మొత్తం తీసి క్లీన్ చేసి దూరంగా పడేస్తున్నారు. దీంతో వీఐపీ ఘాట్ స్నానానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంది.