News January 13, 2026
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
> జనగామ: మున్సిపల్ ఓటర్ జాబితా విడుదల
> జనగామ జిల్లాలో తీసేసి యోచనలో ప్రభుత్వం ఉంది: ఎమ్మెల్యే
> చింతగట్టు జాతరపై ఎమ్మార్వో సమీక్ష సమావేశం
> రాష్ట్రంలో పనిచేసే సీఎం ఉన్నారు: కడియం
> దేవరుప్పులలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ
> రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి: కలెక్టర్
> యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: కలెక్టర్
Similar News
News February 15, 2026
పాక్‌తో ఇవాళే మ్యాచ్.. చక్ దే ఇండియా!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుకు వేళయింది. T20 WCలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఇవాళ సాయంత్రం 7 గంటలకు <<19134206>>మ్యాచ్ ప్రారంభం<<>> కానుంది. ఈ టోర్నీ చరిత్రలో పాక్‌తో ఆడిన 8 మ్యాచుల్లో 7 మన జట్టే గెలిచింది. ఆ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆ టీమ్‌ను మట్టికరిపించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌లో అభిషేక్, సూర్య, బౌలింగ్‌లో బుమ్రా, వరుణ్ చెలరేగితే గెలుపు మనదే. చక్ దే ఇండియా!
News February 15, 2026
ఈనెల 17న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 17న మంగళవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. టీఎస్ కేసీ, మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో బహుళజాతి కంపెనీల్లో నియామకాల కోసం ఈ మేళా చేపడుతున్నారు. డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, పీజీలో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News February 15, 2026
శివ నామాలు అర్థాలు ‘‘కాలభైరవ’’

శివుని ఉగ్ర రూపాలలో ‘కాలభైరవుడు’ శక్తివంతమైనది. ‘కాల’ అంటే సమయం అని అర్థం. సమయాన్ని శాసించేవాడు, కాలాన్ని మింగేసేవాడు కాబట్టి ఆయన కాలభైరవుడు. ముఖ్యంగా కాశీ క్షేత్రానికి ఈయనే రక్షకుడు(క్షేత్ర పాలకుడు). తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించే అధికారం ఈయనకు ఉంటుంది. భక్తుల భయాన్ని పోగొట్టి, శత్రువుల నుంచి రక్షించే దైవం ఈయన. మనలోని అహంకారాన్ని అంతం చేసి మోక్షమార్గాన్ని చూపే దైవంగా ఈయనను ఆరాధిస్తారు.


