News February 8, 2026
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: ఎంపీ
> జనగామ అభివృద్ధి నా బాధ్యతనే: పొంగులేటి
> రేపు స్టేషన్ ఘన్పూర్ కు ఎంపీ ఈటెల రాజేందర్
> జనగామ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన తీన్మార్ మల్లన్న
> కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్
> కాంగ్రెస్ హామీల అమలులో విఫలం అయింది: తీన్మార్ మల్లన్న
> జనగామను వీడిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్
> పాలకుర్తి: బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
Similar News
News February 16, 2026
అన్నమయ్య: ఉత్కంఠ.. కోర్టుకు మాజీ మంత్రి

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందుతుడిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరులు సోమవారం తంబళ్లపల్లె కోర్టులో హాజరు కానున్నారు. వారితో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరి కొంతమంది కూడా కోర్టుకు రానున్నారు. పలు కారణాల రీత్యా ఈనెల 2న మాజీ మంత్రి సోదరులు తంబళ్లపల్లె కోర్టులో వాయిదాకు గైర్హాజరవడంతో వారి తరఫు న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ సమర్పించిన విషయం తెలిసిందే.
News February 16, 2026
MBNR: ఆదర్శం.. రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట

మహబూబ్‌నగర్ జిల్లా శేరిపల్లిలో మతాచారాలు, ఆడంబరాలకు భిన్నంగా రాజ్యాంగం సాక్షిగా వివాహం జరిగింది. రిబుకా, ఉదయ్ అనే నూతన జంట రాజ్యాంగంపై ప్రమాణం చేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ వినూత్న వేడుకలో తెలంగాణ విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు, రెండు కుటుంబాల సభ్యులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఆదర్శ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.
News February 16, 2026
మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ఇలా..

TG: ఇవాళ 7 కార్పొరేషన్ల మేయర్లు, 116 మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఉ.11 గంటలకు గెలిచినవారితో అధికారులు ప్రమాణం చేయిస్తారు. తర్వాత ఆయా పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. మిగతా సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు(MP,MLA,MLC) చేతులెత్తి మద్దతు తెలుపుతారు. 50 శాతానికిపైగా ఓట్లు వచ్చినవారిని విన్నర్‌గా ప్రకటిస్తారు. సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.


