News March 20, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఎండిపోయిన పంట పొలాలకు రూ.25 వేలు ఇవ్వాలని దేవరుప్పులలో బీఆర్ఎస్ నేతల నిరసన, ధర్నా
> 12వ రోజు ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు
> బచ్చన్నపేట: విద్యుత్ ఘాతంతో వృద్ధురాలు మృతి
> ఏసీబీకి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్
> పీసీసీ అధ్యక్షుడిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
> జనగామ కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు
> 100% పన్నులు వసూలు చేయాలి: కలెక్టర్
> ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి కలెక్టర్
Similar News
News January 2, 2026
కామారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీసీసీ అధ్యక్షుడు

కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్కు పుష్పగుచ్ఛం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ పటిష్టతపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు.
News January 2, 2026
శింగనమలకు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్, ప్రియాంక?

ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఫిబ్రవరి 2న శింగనమల నియోజకవర్గంలోని బండపల్లికి కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నట్లు సమాచారం. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని బండ్లపల్లిలోనే ప్రారంభించారు. తర్వాత దేశవ్యాప్తంగా అమలైంది.
News January 2, 2026
NZB: అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తాం: కవిత

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. మొదటి నుంచి నేను స్వతంత్రంగా పని చేశానని, BRSపై మనసు విరిగిందన్నారు. KCR పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.


