News April 11, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
> పాలకుర్తి తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వర చారి
> పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని పాలకుర్తిలో ధర్నా నిర్వహించిన సీపీఎం నేతలు
> లింగాల గణపురం: పిడుగుపాటుకు వ్యక్తి మృతి
> గాలివాన బీభత్సం జిల్లాలో పలుచోట్ల రోడ్లపై విరిగిపడ్డ చెట్లు
> జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయినట్లు సృష్టించి అక్రమంగా భూమి పట్టా
Similar News
News January 2, 2026
పదర: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మధు ప్రియ

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బీనమోని మధు ప్రియ జాతీయ స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 4 కి.మీ. పరుగు పందెంలో ఆమె రజత పతకం సాధించారు. ఈ నెల 23 నుంచి జార్ఖండ్‌లో జరిగే జాతీయ పోటీల్లో మధు ప్రియ పాల్గొంటారని కోచ్ పరశురాముడు తెలిపారు. ఆమె ప్రతిభను పలువురు అభినందించారు.
News January 2, 2026
చిత్తూరు: 59 వేల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో 59,701 పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని 298 గ్రామాల పరిధిలోని అర్హులకు అందజేయనున్నట్టు ఆయన వెల్లడించారు. రీ సర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికను ఉపయోగించి కచ్చితంగా భూ హద్దులను నిర్ణయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అధికారులు.. ప్రజాప్రతినిధులతో కలిసి అందజేస్తారని చెప్పారు.
News January 2, 2026
శ్రీకాళహస్తి వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

తొట్టంబేడు పరిధిలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. వరదయ్యపాలెం వైపు బైకుపై చందు (21) వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


