News April 17, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> పాలకుర్తిలో వైద్యుల నిర్లక్ష్యం శిశువు మృతి చిల్పూర్‌లో భూభారతిపై అవగాహన సదస్సు > కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏర్పాటు చేస్తాం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి > జనగామ: మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా > పసికందు మృతిపై స్పందించిన కలెక్టర్ > పశ్చిమబెంగాల్ లో హిందువులపై దాడిని ఖండిస్తూ జనగామలో నిరసన > అధికారులు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్ > నర్మెట్టలో పామాయిల్ తోట దగ్ధం

Similar News

News April 19, 2025

పెద్దపల్లిలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

image

పెద్దపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర ATM దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ కరుణాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దొంగలు రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములుగా గుర్తించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు నిఘా పెంచి గాలించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

News April 19, 2025

ములుగు: ఆ స్వామి నాభి చందనం సేవిస్తే.. సంతానం కలుగుతుంది!

image

తెలంగాణలోనే 2వ యాదగిరిగుట్టగా పిలుచుకునే మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 6వ శతాబ్దంలోని చోళ చక్రవర్తుల కాలంనాటి నుంచే ఈ ఆలయం ఉన్నట్లు చెబుతుంటారు. స్వామి వారి బొడ్డు నుంచి కారే ద్రవం(నాభి చందనం)కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ద్రవం సేవిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఎంతోమందికి సంతానం కలిగిందని ఇక్కడి అర్చకులు చెబుతుంటారు.

News April 19, 2025

కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

కూసుమంచిలోని హైస్కూల్ ఎదురుగా రెండు రోజుల క్రితం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన పోచారం గ్రామానికి చెందిన ఇందుర్తి శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

error: Content is protected !!