News September 5, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> మహానంది అవార్డు గెలుచుకున్న దేవరుప్పుల వాసి
> సిటీ స్కాన్ అందుబాటులోకి తెచ్చాం: జనగామ ఎమ్మెల్యే
> జనగామ: వన మహోత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్
> కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: కడియం
> పాలకుర్తి: గణేశుడికి 516 పిండి వంటకాలు
> బతుకమ్మ కుంటను అందంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
> దేవరుప్పుల: ఇసుక అక్రమ రవాణా వ్యక్తిపై కేసు నమోదు
> నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు
Similar News
News September 5, 2025
READY.. బాలాపూర్, ఖైరతాబాద్ రూట్ ఇదే

HYD: ఖైరతాబాద్, బాలాపూర్ నిమజ్జన రూట్లను కలెక్టర్ హరిచంద్ర ప్రకటించారు. బాలాపూర్ గణేశ్ కట్టమైసమ్మ నుంచి కేశవగిరి, చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్ జీపీయో, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం గుండా ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. ఖైరతాబాద్ గణేశ్ బడా గణేశ్ నుంచి ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి, అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ వెళ్తుంది.
News September 5, 2025
ఒక్క ఇంటి కరెంట్ బిల్లు రూ.1.61కోట్లు.. చివరికి

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మారుతకుళంలో మరియప్పన్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,61,31,281 కరెంట్ బిల్ వచ్చింది. ఇది చూసిన మరియప్పన్ కుటుంబం షాక్‌కి గురైంది. వెంటనే TNPDCL అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం వల్ల జరిగిందని అధికారులు వెల్లడించారు. తప్పిదాన్ని సవరించగా వారి బిల్లు రూ.1.61కోట్ల నుంచి రూ.494కు చేరింది.
News September 5, 2025
వికారాబాద్, రంగారెడ్డి జిల్లా వాసులకు గుడ్ న్యూస్

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నారు. చిలుకూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణకు 18-40 సంవత్సరాలు ఉండాలన్నారు. 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తారు. ఆసక్తిగల మహిళలు 8500165190 నంబర్‌లో సంప్రదించవచ్చని మహమ్మద్ అలీ ఖాన్ తెలిపారు. స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.