News September 7, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> రేపు పాలకుర్తి సోమేశ్వర ఆలయం మూసివేత
> జనగామ: యూరియా కోసం రైతుల ఇక్కట్లు
> జనగామలో బంజారాల రౌండ్ టేబుల్ సమావేశం
> జనగామ: మా సార్‌ను పంపించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం: విద్యార్థులు
> జవహర్ నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం
> పాలకుర్తి: రాష్ట్ర స్థాయి పోటీలకు ఉపాధ్యాయుడు ఎంపిక
> జనగామ నుంచి లండన్‌కు గణపతి లడ్డూ
> కోర్టుకు హాజరైన జనగామ ఉద్యమకారులు

Similar News

News September 8, 2025

నేడు గండిపేటకు CM.. భారీ బందోబస్తు

image

నేడు గండిపేటలో CM రేవంత్ పర్యటిస్తారు. ఇప్పటికే కలెక్టర్ నారాయణరెడ్డి, MLA ప్రకాశ్ గౌడ్, జలమండలి MD అశోక్ రెడ్డి, రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ఫేజ్ 2, 3కు శంకుస్థాపన, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2‌ను CM ప్రారంభిస్తారు. అనంతరం CM బహిరంగ సభ ఉంటుందని MLA ప్రకాశ్ గౌడ్ తెలిపారు. CM రాకతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

News September 8, 2025

రైతులకు భరోసా కల్పించిన కలెక్టర్ లక్ష్మీశ

image

కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు మండలాల్లో పర్యటించి రైతులతో ముచ్చటించారు. యూరియా సరఫరా పరిస్థితులను స్వయంగా పరిశీలించి, ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణలో ఎరువులు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు. అగ్రికల్చర్ అవుట్‌డోర్ కార్యక్రమంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.

News September 8, 2025

కామారెడ్డి: విద్యుత్ కార్యాలయంలో ప్రజావాణి

image

కామారెడ్డిలోని విద్యుత్ కార్యాలయంలో సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్‌ఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వినతులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.