News October 11, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> దేవరుప్పుల: దాడి చేసిన వ్యక్తికి రిమాండ్
> జనగామలో సెల్ టవర్ నిర్మించొద్దని నిరసన
> ప్రధానమంత్రి దన్, ధ్యాన కృషి యోజన పథకానికి జిల్లా ఎంపిక
> కలెక్టరేట్ ఎదుట పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ జేఏసీ నిరసన
> అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచాలి: కలెక్టర్
> బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాలి: అదనపు కలెక్టర్
> రఘునాథపల్లి: కుక్కల దాడిలో 7 మేక పిల్లలు మృతి
Similar News
News October 11, 2025
మూడో తరగతి నుంచే AI పాఠాలు!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో మూడో తరగతి నుంచే AIపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఫ్యూచర్ వర్క్ ఫోర్స్‌ను AI-రెడీగా మార్చాలని భావిస్తోంది. టీచర్లు AI టూల్స్ వాడి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు జరుగుతున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. కాగా కొన్ని CBSE స్కూళ్లలో ఇప్పటికే AIపై పాఠాలు బోధిస్తున్నారు.
News October 11, 2025
ముంబైలో రూ.3కోట్ల హవాలా డబ్బును పట్టుకున్న ఈగల్ టీమ్

ఈగిల్ టీమ్ మరో ఆపరేషన్‌లో విజయవంతం చేసింది. డ్రగ్, మనీ లాండరింగ్ కింగ్‌పిన్ దర్గారం ప్రజాపతిని అరెస్ట్ చేసింది. ముంబైలో రూ.3 కోట్ల హవాలా డబ్బు స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ కార్టెల్ నెట్‌వర్క్‌ను ఈగిల్ టీమ్ ఛేదించింది. ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ అయ్యారు. నకిలీ పాస్‌పోర్ట్‌లతో విదేశీయులు ప్రవేశిస్తున్నట్లు కూడా గుర్తించారు.
News October 11, 2025
‘కల్కి-2’లో అలియా భట్?

‘కల్కి-2’ మూవీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి నెలకొంది. ఇందులో నటించాల్సిందిగా అలియా భట్‌ను మూవీ టీమ్ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పార్ట్-1లో ‘కల్కి’ని గర్భంలో మోస్తున్న ‘సుమతి’ అనే మహిళ పాత్రలో దీపిక కనిపించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు ఎవరైతే బాగుంటారో కామెంట్ చేయండి.