News October 25, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> పాలకుర్తి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
> స్టేషన్ ఘనపూర్: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
> రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి: రంగారెడ్డి
> ఎస్ఐఆర్‌ను పొరపాట్లు లేకుండా చేయాలి: సుదర్శన్ రెడ్డి
> జనగామ కలెక్టరేట్‌లో ఒప్పంద అధ్యాపకుల నిరసన
> జనగామ: భార్యాభర్తలిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష
> జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు
> జనగామలో పత్తి రైతుల రాష్ట్ర సదస్సు

Similar News

News October 26, 2025

మెదక్: కనుమరుగైన కళాకారులు

image

ఒకప్పుడు నాటకాలకు పేరుగాంచిన మెదక్ జిల్లా ఇప్పుడు కళాకారులే కరవయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కళాకారులు అధిక సంఖ్యలో ఉండేవారు. టీవీ, మొబైల్స్ రావడం వల్ల నాటి కళలకు ఆధరణ లేకుండాపోయింది. ఒకప్పుడు గ్రామ ప్రధాన కూడలి వద్ద భజనలు, నాటకాలు వేసేవారు. ఇప్పుడు వాటికి ఆదరణ లేక కనుమరుగైపోయాయి. దీంతో ఆ కళాకారులు ఇతర వృత్తుల వైపు వెళ్లారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

News October 26, 2025

కరీంనగర్: వస్తే SHOP.. పోతే రూ.3లక్షలు..!

image

మద్యం షాపుల లైసెన్సుల అదృష్టం ఎవర్ని వరిస్తుందో రేపు తేలనుంది. కొందరు సెంటిమెంట్‌తో దేవుళ్ల పేర్లతో అప్లై చేశారు. అయితే అవి ఏమాత్రం తమ లక్కీడోర్‌ను ‘KNOCK’ చేస్తాయోనని చూస్తున్నారు. కాగా, ఉమ్మడి KNRలో 287 షాపులకు 7600 వరకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ.228 కోట్ల ఆదాయం సమకూరింది.
* KNR- 94 షాపులకు 2730 అప్లికేషన్లు
* JGTL- 71 షాపులకు 1966
* PDPL- 74 షాపులకు 1488
* SRCL- 48 షాపులకు 1381

News October 26, 2025

ఈనెల 27న మద్యం దుకాణాలు కేటాయింపు: కలెక్టర్

image

నూతన మద్యం పాలసీ 2025- 27లో భాగంగా ఈనెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు ASF జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు/ అధీకృత వ్యక్తులు సకాలంలో కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన తెలిపారు.