News November 20, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే
> జిల్లా వ్యాప్తంగా ఇందిరా గాంధీ జయంతి
> కోటి చీరల పంపిణీపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
> వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది: కలెక్టర్
> ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు భేటీ
> మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది: ఎంపీ
> పెంబర్తిలో టాటా ఏస్ వాహనం బోల్తా
Similar News
News November 20, 2025
‘వారణాసి’ కథ ఇదేనా?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’కి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కథ ఇదేనంటూ ‘Letterboxd’లో పోస్ట్ చేసిన synopsis వైరల్ అవుతోంది. ‘వారణాసిని ఒక గ్రహశకలం ఢీకొన్నప్పుడు అది ఎలాంటి ఘటనలకు దారి తీస్తుంది. ప్రపంచం నాశనం అవుతుందా? దీన్ని ఆపేందుకు ఖండాలు, కాలక్రమాలను దాటాల్సిన రక్షకుడు అవసరమా?’ అని అందులో ఉంది. ఈ టైమ్ ట్రావెల్ కథలో మహేశ్ 2 పాత్రల్లో కనిపిస్తారని చర్చ సాగుతోంది.
News November 20, 2025
మదనపల్లె: పైపైకి టమాటా ధరలు.!

మదనపల్లెలో టమాటాల ధరలు రోజురోజుకూ పెరుగుతుండంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. బుధవారం మార్కెట్‌కు 140 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకురాగా.. హోల్ సేల్ వ్యాపారులు 10 కిలోల మొదటిరకం టమాటా బాక్స్‌ను రూ.550, రెండోరకం టమాటాలను రూ.520, మూడోరకం టమాటా బాక్స్‌ను రూ.430తో కొనుగోలుచేసినట్లు సెక్రటరీ జగదీశ్ మీడియాకు తెలిపారు.
News November 20, 2025
బిక్కనూర్: డిసెంబర్ 11న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్

డిసెంబర్ 11న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా కల్పిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.


